నేటి సాక్షి, కరీంనగర్: ఇటీవల ప్రముఖ జీనియస్ చెస్ అకాడమీ వారు నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ పోటీల్లో స్థానిక భగత్‌నగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎస్ శ్రావిక్ మూడో ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో సదరు విద్యార్థిని స్కూల్ డైరెక్టర్ సౌగాని అనుదీప్ అభినందించారు. శ్రావిక్ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో విజయం సాధించి, కరీంనగర్‌కు, తెలంగాణకు, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
తమ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా తమవంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు.