మున్సిపల్ చైర్ పర్సన్ హుజురాబాద్ గందె రాధిక శ్రీనివాస్
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ హుజురాబాద్ గందె రాధిక శ్రీనివాస్ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ ప్రజల సహాయ సహకారాలతో చైర్పర్సన్ గా హుజురాబాద్ ను అభివృద్ధి పథంలో నడిపించడం జరిగిందని, మీ ఆశీస్సులతో 5సంలు మున్సిపల్ చైర్ పర్సన్ గా విధులు పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. సమస్త హుజురాబాద్ ప్రజానికానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తెలిసో తెలియకో, ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నొప్పిస్తే క్షమించగలరని వేడుకున్నారు. పదవి అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు మేము మీ ఆత్మీయులమేనని, ఎప్పుడు మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నానని పేర్కొన్నారు.





