
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న కంబాల రాములుపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ హుజరాబాద్ మండలం లోని అన్ని పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల వనరుల కేంద్రం హుజురాబాద్ వద్ద DTF రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాములు పై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో DTF హుజురాబాద్ మండల బాధ్యులు ఎస్ చక్రధర్, అల్లి శ్రీనివాస్, కనకం వెంకటస్వామి, D సదానందం, ఆర్ భాస్కర్, M రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, PRTU రాష్ట్ర నాయకులు మ్యక రాములు తదితరులు పాల్గొన్నారు.





