- రోడ్డు హైట్ పెంచడంతో ప్రమాదాలు
- రోడ్డు కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం – రోడ్డు ప్రమాదంలో యువకుడి బలి


నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం నుండి తుమ్మలూరు గేట్ వరకు ఏదురేదురుగా వస్తున్న రొండు ద్విచక్ర వాహనాలు డీకొని యువకుడు మృతి నిన్న రాత్రి 7.00 గంటలకు తుమ్మలూరు గేట్ నుండి తుమ్మలూరు గ్రామానికి వచ్చే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన శివ కుమార్ పల్సర్ బైక్ పైన మహేశ్వరం నుండి తన గ్రామం గుమ్మడవెల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ని డీకొని ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాపడ్డ గుమ్మడవెల్లికి చెందిన ఉండేల. శివకుమార్ (చింటు) హైదరాబాద్ లోని నీలాద్రి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించటం జరిగింది.
శివకుమార్ తండ్రి కిష్టయ్య, వృత్తి: డ్రైవింగ్, వయస్సు: 23 సంవత్సరాలు, గ్రామం: గుమ్మడవెల్లి, మరో బైక్ పైన పయనిస్తున్న మహేశ్వరం గ్రామానికి చెందిన మరో ఇద్దరికి రెవెల్లే.యాదగిరి రాయుడు మరియు సురేష్ లకి హాస్పిటల్స్ లో చికిత్స కొనసాగుతుంది. తుమ్మలూరు రోడ్డు పనులు ప్రారంభమయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అసంపూర్ణంగానే ఉంది. * అవసరానికి మించి రోడ్డు ఎత్తుగా పెంచటం వలన అలాగే రోడ్డు ఎత్తుకి సంబంధించి ఎలాంటి ప్రమాదం హెచ్చరికలు పెట్టకుండా అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. * గత కొన్ని రోజులుగా ఈ రోడ్డు పైన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే విషయం గురించి తుమ్మలూరు గ్రామ యువకులు సంబంధిత అధికారులని కలిసినప్పుడు రోడ్డు ఎత్తున్ని తగ్గించటం కుదరదు కానీ రోడ్డుకి ఇరువైపులా సేఫ్టీ గార్డ్స్ పెడుతామని, ప్రయాణికులు గుర్తి పట్టేలా రేడియం స్టికర్స్ వేయిస్తామని, ప్రమాదం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాత్రి సమయాలలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చీకటి ఎక్కువగా ఉందటం రోడ్డుని అంచనా వేయకపోవడంతో రోడ్డు పైన వెళ్తున్న చాలా మంది ప్రయాణికులు ప్రమాదాలకి గురౌతున్నారు. దీని నీవరించారానికి రోడ్డుకు ఆల్రెడీ ఉన్న లైట్స్ ని రిపేర్ చేసి అన్ని స్థంబాలకి లైట్స్ వెలిగేలా చూడాలని గతంలోనే అధికారులని కొరమని, * అలాగే రోడ్డు కి ఇరు వైపులా చెట్లని నాటాలని కోరడం జరిగిందని,కానీ అధికారులు నుండి కానీ కాంట్రాక్టర్ నుండి కానీ ఎలాంటి స్పందనా లేదన్నారు. ఈరోజు తుమ్మలూరు గ్రామ యువత ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ లో జరిగే ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ప్రతిభ సింగ్ మరియు డిఆర్ఓ సంగీత దృష్టికి ఈ రోడ్డు సమస్యని తీసుకెళ్లటం జరిగిందన్నారు. అడిషనల్ కలెక్టర్ స్పందిస్తూ సంబందిత అధికారులతో మాట్లాడి ఈ రోడ్డు సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందన్నారు.





