Sunday, March 22, 2026

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

  • జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్‌ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై జిల్లాల కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సూర్యాపేట కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తెజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ తో కలిసి శుక్రవారం పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ జారీ, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన వసతులు, వెబ్ కాస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదీర్ఘంగా చర్చించి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు 23 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిబ్బందిని నియమించి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను నేరుగా నల్గొండ తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉన్నాయని, పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు. పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు రిపోర్ట్ అందించేలా వ్యవస్థ సిద్ధం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, కలెక్టరేట్ ఎన్నికల డిటి వేణు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News