Tuesday, March 24, 2026

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 200 పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు

  • పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలు
  • పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి
  • జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

నేటి సాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్) : ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛాయుత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు. సోమవారం సిరిసిల్ల, తంగలపల్లి, చందుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల మీద అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..ఈనెల 27 వ తేదీన జరుగు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో ఏర్పాటు చేసిన 41 పోలింగ్ కేంద్రాలో 23,347 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేల పోలింగ్ పక్రియ మొదలు నుండి పూర్తి అయ్యేవరకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని పోలీస్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని, ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పి తెలిపారు. ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ,రూరల్ సి.ఐ మొగిలి, చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News