నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని ప్రాణహిత కాలనీకి చెందిన బొడ్డు భూమయ్య పోషక్క దంపతుల కుమారుడైన బొడ్డు తిరుపతి మంగళవారం ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో 77వ ర్యాంకు సాధించి మందమర్రి పేరును రాష్ట్ర స్థాయిలో తీసుకువెళ్లాడని పలువురు హర్షం వ్యక్తం చేశారు. బొడ్డు తిరుపతి గతంలో సింగరేణి యాజమాన్యం నిర్వహించిన జెఎంఈటి పరీక్షలలో 2వ ర్యాంకు సాధించి సింగరేణిలో జెఎంఈటి గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. తద నంతరం గ్రూప్ 4 లో మంచి ర్యాంకు సాధించి క్యాతనపల్లి మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్ 2 ఫలితాలలో 77వ ర్యాంకు రావడంతో తిరుపతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.





