Tuesday, March 17, 2026

సోమవారం జరగాల్సిన తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు

  • ప్రత్యేక సమావేశం వాయిదా నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు కొనసాగింపు,
  • జిల్లా కలెక్టర్
  • ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు 144 సెక్షన్ అమలు
  • జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నందు ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేక పోవడం వలన నేటి సోమవారం వాయిదా పడిన నేపథ్యంలో తిరుపతి పట్టణం నందు 144 సెక్షన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అమలులో ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ దిశగా అదనపు బలగాలతో సుమారు 250 మందితో బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ నేటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News