నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జిల్లాలోని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో సంఘం డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ 2025 ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిపాలన అధికారి కృష్ణ హాజరై, టిఎన్జీవో నూతన డైరీ, క్యాలెండర్- 2025 ను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా ఆవిష్కరించారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా టీఎన్జీవో డైరీని, నూతన సంవత్సర క్యాలెండర్- 2025 ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిఎన్జీవో డైరీ, క్యాలెండర్ ను మంచి విషయాలతో, ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా తయారు చేశారని కొనియాడారు. టీఎన్జీవో డైరీ ప్రతి ఉద్యోగికి విధి నిర్వహణలో ఉపయోగపడే జిఓ లు అన్ని డైరీలో పొందుపరిచారని, వివరాలు చాలా క్లుప్తంగా ఉన్నాయని, ఇది ప్రతి ఒక్క ఉద్యోగికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సరిత లు పాల్గొన్నారు.





