Wednesday, March 25, 2026

విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించాలి

నేటి సాక్షి, కరీంనగర్ : ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్పీహెచ్ఎస్ వెన్నంపల్లి పాఠశాలలొ ఘనంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై విద్యార్ధులకు శాస్త్రీయ అవగాహన కల్పించడం జరిగింది. నిత్యజీవితంలో సైన్స్ వలన కలిగే లాభాలను నష్టాలను వివరించారు. నేటి పోటీ ప్రపంచంలో సైన్స్ ఆవశ్యకతను గురించి విద్యార్థులకు ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలించాలని, శాస్త్రీయ వైఖరులు పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ .ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలోని జరుగుతున్న రుగ్మతలను వివరంగా వివరించి విద్యార్థులను ఉత్సాహ పరచినారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలను తిలకించినారు. ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు టి. జయగోపాల్ సింగ్,ఎం జయప్రద మేడం విద్యార్థులు ప్రదర్శనలను ప్రదర్శించడంలో ఎంతగానో ఉత్సాహపరిచి పిల్లలను శాస్త్రీయ అవగాహన పెంచడం కోసం ఈ ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపినారు. కార్యక్రమంలో మిగతా ఉపాధ్యాయులు కేతిరి శ్రీనివాసరెడ్డి, వి. ప్రవీణ్ కుమార్, కే. సత్యనారాయణ రెడ్డి, జి. కుమార్,సత్య, పద్మ, నలిని, రమేష్ గార్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News