- మండల విద్యాధికారి కె. రామయ్య
నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్) : నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల నిర్వహణ కొరకు గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల విద్యాధికారి కె రామయ్య తెలిపారు. మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలలు రెండు ప్రైవేటు పాఠశాలలు 214 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాస్తున్నారని తెలిపారు అందులో 78 మంది బాలురు, 136 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. పరీక్షలు సహజవుగా జరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులను ఏర్పాట్లు చేసామన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని అన్నారు. పరీక్ష కేంద్రానికి విధి నిర్వహణ చేసే ఇన్విజిలేటర్లు విధులను సరైన విధంగా నిర్వర్తించాలని సూచించారు. ఇన్విజిలేటర్లు ఎవరు కూడా చరవనులను తీసుకురావద్దని ఆదేశించారు పరీక్ష కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆ విధంగా పోలీస్ శాఖ వారు సహకరించాలని కోరారు.





