- అనతికాలంలోనే అన్ని వర్గాల్లో పేరు ప్రఖ్యాతలు
- వాస్తవాలు ప్రజల ముందుంచడంలో కొత్త ట్రెండ్
- దుబాయ్ లో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ
- ఆవిష్కరించిన ఫ్రెష్ ఆఫ్ కార్ వాష్ కంపెనీ అధినేత మోతే రాములు
- వేములవాడ ఆర్.సి ఇన్చార్జ్ కోక్కుల వంశీ కి ఘన సత్కారం

నేటి సాక్షి ప్రతినిధి, దుబాయ్ గల్ఫ్ ప్రతినిధి ( కోక్కుల వంశీ ) : సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న ‘ నేటి సాక్షి ‘ దినపత్రిక 2025 క్యాలెండర్ ను శుక్రవారం దుబాయ్ లోని బర్ దుబాయ్ లోని ఫ్రెష్ ఆఫ్ కార్ వాష్ కార్యాలయంలో ప్రముఖ ఎన్నారై, ఫ్రెష్ ఆఫ్ కార్ వాష్ కంపెనీ అధినేత మోతే రాములు నేటి సాక్షి వేములవాడ ఆర్ సి ఇంచార్జి కోక్కుల వంశీతో కలిసి క్యాలండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోతే రాములు మాట్లాడుతూ… పత్రికలు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా ఉండాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు తెలియజేయాలన్నారు.
నేటి సాక్షి దినపత్రిక ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుందని అన్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందుంచి “నేటితరం” తో కొత్త ట్రెండును సృష్టించిందన్నారు. నేటి సాక్షి దినపత్రిక మరింత మంచి కథనాలతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం మోతే రాములు వేములవాడ ఆర్ సి ఇంచార్జి, నేటి సాక్షి ప్రతినిధి కోక్కుల వంశీ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్, రైటర్ కోరేం మల్లేష్, పోగుల మహేష్, పోగుల నర్సయ్య, పండుగ నర్సయ్య ,మర్రి సాయి, మోతే ఆకాశ్ లు పాల్గొన్నారు.





