- వరంగల్ జిల్లా డీ ఎం అండ్ హెచ్ ఓ. డాక్టర్ సాంబ శివరావు
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : పత్రిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన “నేటి సాక్షి” దినపత్రిక 2025 క్యాలెండర్ ను గురువారం రోజున వరంగల్ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో వరంగల్ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. బి. సాంబ శివరావు ఆవరణలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ తో కలిసి నేటిసాక్షి దినపత్రిక 2025 క్యాలండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్.బీ. సాంబశివరావు మాట్లాడుతూ… నేటిసాక్షి దినపత్రిక ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం వార్తా కధనాలు రాస్తుందన్నారు. నిజాలను నిర్భయంగా రాస్తూ వాస్తవాలను వెలుగులోకి తెస్తోందన్నారు. సామాన్యులను ఆలోచింప చేసి ప్రజలను చైతన్య పరుస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ ప్రజలవైపు నిలవాలని సూచించారు. నేటి సాక్షి దినపత్రిక ప్రజల మన్ననలు పొందాలని, ప్రజా సమస్యలను వెలికి తీసి అధికారులకు చేరవేయడంలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సదానందం, కిరణ్ మరియు నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సందెల రాజు తదితరులు పాల్గొన్నారు.





