Tuesday, March 17, 2026

‘ నేటి సాక్షి ‘ ఎఫెక్ట్..!

  • స్పందించిన మున్సిపల్ కమిషనర్
  • రోడ్డు మరమ్మతులు చేపట్టి గుంతాను పూడ్చిన అధికారులు

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులతో రద్దీగా ఉండే పలు ప్రదేశాలతో పాటు వేములవాడ పట్టణంలోని రాం మందిరం వెళ్ళే రోడ్డు అస్తవ్యస్తంగా తయారై ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డుపై ‘‘నేటి సాక్షి” దినపత్రిక మంగళవారం కథనం ప్రచురించింది.

పడిందో పెద్ద గుంత..! పడితే దొరకదు బొక్క..!

రోడ్డు పేరుతో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యని వెలుగులోకి తీసుకొచ్చిన కథనానికి మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్పందించారు. విషయం తెలుసుకున్న కమిషనర్ వెంటనే స్పందించి గుంత పడిన రోడ్డు సంఘటన స్థలానికి చేరుకొని మున్సిపల్ సిబ్బందితో గుంత పడిన చోట రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టి గుంతను పూడ్చివేశారు. దీంతో నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి అధికారుల దృష్టికి చేరవేస్తున్న “నేటి సాక్షి దినపత్రిక” పట్ల పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వేములవాడ నియోజకవర్గంతో పాటు పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను మా నేటి సాక్షి దినపత్రిక వాట్సాప్ – 97000 00615 ద్వారా తెలియజేయండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News