నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండల పరిధిలోని గువ్వల దీన్నే లో ఎం పి యు పి ఎస్ స్కూల్లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు టీచర్లుగా ప్రధానోపాధ్యాయులుగా ఎంఈఓ గా కలెక్టర్ గా పాత్రలు పోషించి పిల్లలకు ఉపాధ్యాయులు మాదిరిగా పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఎం పీ యు పి ఎస్ గువ్వల దీన్నే ఈ స్కూల్ హెచ్ఎం నాజియ బేగం మాట్లాడుతూ.. ఈ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా నా విద్యార్థులు నా కళ్ళ ముందు ఉపాధ్యాయుల పోస్టులు ఇంకా ఉన్నతమైన పోస్టుల్లో పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉన్నదని కొనియాడారు. అదేవిధంగా ఇది పాత్రకే కాకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఏ పాత్ర అయితే పోషించారు. అదే పాత్రలో మీరు ఆ విజయాలను చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని విద్యార్థులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ స్కూల్ చైర్మన్ తిమ్మప్ప స్వామి శ్రీ ఏ ఏ ఏ పి చైర్మన్ హైమావతి విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.




