Sunday, March 15, 2026

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి

నేటి సాక్షి మెదక్ జిల్లా కొల్చారం (భూమయ్య) : మెదక్ జిల్లా కొల్చారం మండలం కేంద్రంలోని బాబా ఫంక్షన్ హాల్ లో టీపీసీసీ కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 34 మందికి సుమారుగా 11.88.500 లక్షల రూపాయల గల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కారణాలవల్ల రకరకాల వ్యాధుల బారిన పడి అప్పుడు తెచ్చుకొని వ్యాధులు నయం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి పేదవారికి అండగా నిలుస్తూ నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు గోవర్ధన్ సీనియర్ నాయకుడు దేవన గారి శేఖర్ ఏల్లు గారి శ్రీనివాస్ రెడ్డి నాయిని వెంకట్ గౌడ్ గజిని మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News