- నంబర్ ప్లేట్ లేని వాహనాలు 65 సీజ్
- వాహన చోదకులకు వనపర్తి సీఐ కృష్ణయ్య కౌన్సిలింగ్ ఇచ్చారు
- రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి
- ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర
- ప్రొఫెషనల్ ఎస్సై హిమబిందు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :
శుక్రవారం వనపర్తి పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డులో వాహనాలు తనిఖీ చేయాలని సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి మరియు వనపర్తి ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర వాహనాలు తనిఖీ చేశారు. వనపర్తి సీఐ కృష్ణయ్య మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో పలు ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్ లు లేకుండా విచ్చలవిడిగా వాహన చోదకులు తిరుగుతున్నారు, రోడ్లపై తిరుగుతున్న వాహన చోదకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ కృష్ణయ్య హెచ్చరించారు. వనపర్తి పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ వాహన దారులకు పలు సూచనలు చేశారు.

వాహన చోదకులు అతి వేగంగా వెళితే, రాంగ్ రూట్లో వెళ్తే, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే, త్రిబుల్ డ్రైవింగ్ వెళ్లిన వారికి కచ్చితంగా జరిమానాలు విధించాలని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి కి, ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర ను ఆదేశించారు.వనపర్తి పట్టణ రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వాహన చోదకులను ఖచ్చితంగా తన వహనానికి వెనుకా, ముందు నంబర్ ప్లేట్ ను క్లియర్ గా కనిపించేటట్లు వేసుకోవాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని విచ్చలవిడిగా లైసెన్సు లేకుండా పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరిస్తూ వనపర్తి జిల్లాలో ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేస్తున్నామని వనపర్తి ట్రాఫిక్ ఎస్సై తెలియజేసారు, ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర 65 వాహనాలు సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతే కటకటాల పాలు అవుతారని వాహనచోదకులను హెచ్చరించారు. విచ్చలవిడిగా మద్యం సేవించి మీ ప్రాణాలను పోగొట్టుకోకూడ దన్నారు.

మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారని పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజల ప్రాణాలను కాపాడడమే మా బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెషనల్ ఎస్సై హిమబిందు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నంబర్ లేనివి వాటికి నెంబర్ వేసుకునే విధంగా వాహన చోదకులకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఖచ్చింతంగా హెల్మెట్ పెట్టుకోవాలని ప్రొఫెషనల్ ఎస్సై హిమబిందు అన్నారు. ట్రాఫిక్ ఎఎస్ఐ నిరంజన్ మాట్లాడుతూ వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వాహనాల తనిఖీ నిరంతరంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. తనిఖీల్లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

