- జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
నేటి సాక్షి నర్సింహులపేట భూక్య రవి:
గురువారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లాలోని నరసింహాలపేట మండలల్లో విస్తృతంగా పర్యటించారు. గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవల గురించి సంబంధిత వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలనీ సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారము వైద్య పరీక్షలు క్యాంప్ లు నిర్వహించాలన్నారు. సిబ్బంది హాజరు పట్టిక మందుల స్టాక్ వివరాలను తనిఖీ చేశారుప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. జనవరి 26 నుండి ప్రారంభం కానున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేందుకు సిద్ధం కావాలని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల అమలు కు సంబంధించి ప్రణాళిక ప్రకారం ప్రత్యేక బృందాల సర్వేలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.





