Friday, March 13, 2026

గిరిజన హాస్టల్ వర్కర్లకు కలెక్టర్ జివో ప్రకారం వేతనాలు చెల్లించాలి

  • ఏఎన్ఏంలకు 11 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
  • జనవరి 24న ఛలో హైదరాబాద్ ధర్నాను జయప్రదం చేయండి
  • జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయ ఏవో కు వినతి పత్రం

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
గిరిజన హాస్టల్ వర్కర్లకు కలెక్టర్ జివో ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఏఎన్ఏంలకు 11 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని గిరిజన సంక్షేమ శాఖ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయ ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని గిరిజన ఆశ్రమ సంక్షేమ పాఠశాలలు, హాస్టల్ లలో పనిచేస్తున్న డైలీ వైస్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం వర్కర్లకు గత 3 నెలలుగా వేతనాలు రావడం లేదని, ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ జివో ప్రకారం వేతనాలు చెల్లించారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తెచ్చిన జివో 64ను అమలు చేయలని చూస్తున్నారని, ఆలా అమలు జరిగితే ప్రస్తుతం ఉన్న వేతనాలు కంటే చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తారన్నారు. అదే విదంగా విద్యార్థుల సంక్షేమం చూసే అవుట్ ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు గత 11 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 నెలలు వేతనాలు చెల్లించాలని ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ సైతం చెల్లించడం లేదని అన్నారు. ఇప్పటికే పలు మార్లు జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ కు, ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు పిఓ చెప్పిన ఫలితం లేదని, అందుకే ఛలో హైదరాబాద్ గిరిజన శాఖ కమీషనర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి మంచిర్యాల జిల్లాలోని అన్ని రకాల వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) వర్కర్స్, ఏఎన్ఎంలు రాజమణి, సుమిత్ర, భవాని, స్వప్న మహేశ్వరీ, శ్వేత, రాధ, మంధఖీని, ప్రవళిక, సుజత, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News