నేటి సాక్షి, రామగిరి (కన్నూరి రాజు):
బుధవారం ఆర్మీ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో దేశ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందిన తరువాత సింగరేణి సంస్థలో చేరి ఓసీపీ 2 సేవలందిస్తున్నా మాజీ సైనికులు కోట రవీందర్ రెడ్డి,మదన్ ప్రసాద్,కసిం,దర్మెందర్ లను ఘనంగా సన్మానించడం జరిగింది.అనంతరం క్లబ్ అధ్యక్షులు మొలుమురి శ్రీనివాస్,డైరెక్టర్,మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ మనం ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం భారత సైనికులు,24 గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని,కాశ్మీరు మంచును, మేఘాలయా వర్షాలను లెక్కచేయకుండా దేశరక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు. దేశ రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా మంచుగడ్డల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ రెప్పలా కాపాడుతున్నారు. వారిని రవించుకోవడం మన మన బాధ్యత అని తెలిపారు అలాగే మాజీ సైనికులు, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1949 వరకు కూడా భారత సైన్యానికి ఒక బ్రిటీష్ అధికారి జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నాయకత్వం వహించారు. 1949 జనవరి 15న ఆయన పదవి విరమణ చేసిన భారతీయుడైన లెఫ్టినెంట్ జెనెరల్ యం యం కరియప్పకు భారత సైన్య పగ్గాలను అప్పగించారు.దీంతో భారత సైన్యానికి మొట్టమొదటి భారతీయ ఆర్మీ జనరల్ యం యం కరియప్ప చరిత్రకెక్కారు.ఆ రోజు భారత సైన్యం పూర్తిగా బ్రిటీష్ వారి నుంచి విముక్తి పొందింది గనుక ఈ రోజునే భారత సైన్యం ఇండియన్ ఆర్మీ డే వేడుకలు జరుపుకుంటుందని, మమ్ములను సన్మానించిన లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యమంలో ఓ సి పి 2 సంక్షేమ అధికారి ప్రీతి,లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లంకీ రామారావు,మేకల మారుతి యాదవ్,పరాంకుశం శ్రీనివాస చారి మరియు కార్మిక సంఘ నాయకులు ఎంఆర్సీ రెడ్డి, రామిడ్ల మనోహర్, సంతోష్,సదానందం,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.





