నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆర్డిఓ మన్నే ప్రభాకర్ ను, సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం సన్మానించడం జరిగింది. ఎల్లారెడ్డి పట్టణ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ నూతన సంవత్సరపు క్యాలెండర్ ని, ఆర్డిఓ ప్రభాకర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రభాకర్ మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తు చేసుకున్నచో, 30 రోజులలో కావలసిన సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయం నుండి తీసుకోవచ్చని, ఈ స.హా చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఎంఎ సలీం, అతడి ఆర్గనైజేషన్ సభ్యులకు, ఆర్డిఓ అభినందనలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ డైరెక్టర్ ఎంఏ సలీం మరియు దండుగుల లింగయ్య, యాదగిరి గౌడ్, పల్లెపు రాజు తదితరులు పాల్గొని, ఆర్డీవోకు శాలువా కప్పి సన్మానించడం జరిగింది.





