నేటి సాక్షి,వేమనపల్లి:
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా నీల్వాయిలో శుక్రవారం మాజీ జడ్పీటీసీ సంతోష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటనీ, దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని, పది సంవత్సరాలు ప్రధానిగా పనిచేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోనే సాధ్యం కావడం జరిగిందనీ, సోనియా గాంధీకి ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల దృష్ట్యా ప్రధాని పదవిని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి ఒడిల రాజన్న కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

