- గువ్వలదిన్నె జంబయ్య మాదిగ
- ఎమ్మార్పీఎస్ కే టి దొడ్డి మండలఇంచార్జి
నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరులకు పువ్వులదండలు ఘనమైన నివాళి అర్పించారు. పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరులను స్మరిస్తూ మాదిగ అమరులకు కే టి దొడ్డి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ కే టి దొడ్డి మండల ఇంచార్జి గువ్వలదిన్నె జంబయ్య మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ కే టి దొడ్డి మండల ఇంచార్జి గువ్వలదిన్నె జంబయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ.. మాదిగ జాతి భవిష్యత్తుపై ఎస్సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన మాదిగ అమరుల త్యాగాలు మరువలేనివని మాదిగ వీరుల మరణం లేదు జగతి ఉన్నంత కాలం సజీవంగా జీవించి ఉంటారని అమరుల ఆశయ సాధన కోసం మంద కృష్ణ మాదిగ గారి సారధ్యంలో జరిగే ప్రతి పోరుకు మాదిగలు సమసిద్ధమై ఉండాలని లక్ష డప్పుల వేల గొంతుల మాదిగల మహా ప్రదర్శనకు మాదిగలు సిద్ధమై ఉండాలని మాదిగల విజయం అమరులకు అంకితం అని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో నక్కలి నర్సింలు కొండాపురంరాజు, నందిన్నె అధ్యక్షులు నర్సింహా, పుగ్గాలఈరన్న,గోకరప్ప,కొండన్న,కర్రెప్ప,తదితరులు పాల్గొన్నారు.




