Thursday, March 12, 2026

పెద్దపల్లిలో ఎన్టీఆర్ కి ఘన నివాళులు

నేటి సాక్షి,పెద్దపల్లి(వోడ్నాల తిరుపతి);పెద్దపల్లి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప గుడి చౌరస్తాలో గల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అభిమాన సంఘం నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, అక్కపాక తిరుపతి, మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీ రామారావు గొప్ప నాయకులని, బడుగు బలహీన వర్గాల సామాజిక నాయకులు,సినీ ప్రపంచంలో పాత్రలకు జీవం పోసిన మహా నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, దుర్యోధనుడిగా, కర్ణుడుగా, పౌరాణిక పాత్రలతో పాటు జానపద, ప్రజలను చైతన్యవంతులుగా, సామాజిక చిత్రాలు అనేక పాత్రలు చేసినా గొప్ప నాయకులు ఎన్టీఆర్ కు, కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వాలని ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిరుపేదలకు ఇండ్లు, జనతా వస్త్రాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, బడుగు బలహీన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళలకు, తండ్రి ఆస్తిలో హక్కు, అనేక పథకాల ప్రవేశపెట్టి మద్యపానం సంపూర్ణంగా నిషేధించిన ప్రభుత్వం, అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల నాడుల్లో తీరస్తాయి నిలిచిన గొప్ప నాయకులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్, రంగాపురం మాజీ సర్పంచ్ కలవన మహేందర్, భీమోజు సురేందర్, బొడ్డుపల్లి అశోక్, తాళ్ల కళ్యాణ్, కొప్పుల మురళి, జాపతి సత్యం, ఎన్టీఆర్ అభిమాన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News