- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
- మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బి.ఎస్. కేశవ్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్( రమేష్ ) : ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, కవయిత్రి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ…మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బి.ఎస్.కేశవ్… కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ ఈ దేశంలో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత,విద్య ద్వారానే బడుగు బలహీన, పేద వర్గాలకు విముక్తి లభిస్తుందని నమ్మి పేద విద్యార్థులు, మహిళల హక్కుల కోసం తన జీవిత కాలం పోరాటం చేసిన క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు,జిల్లా ఆయా మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



