Friday, March 20, 2026

పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్లకు ఘన నివాళులు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం పుల్వామాల్లో చనిపోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ సెంటర్ అధ్యక్షులు దార కుమార స్వామి మాట్లాడుతూ, అమర జవాన్లు కారణంగానే నేడు దేశంలోని ప్రజలందరు సుఖసంతోషాలతో ఉంటున్నారని తెలిపారు. కానీ నేటి యువత పక్కదారి పడుతున్నారని, యువతరం మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, బానిసలుగా మారి చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటితరం యువత ఆర్మీలో కానీ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తూ, దేశానికి ఏదో ఒక విధమైన సేవ చేసినప్పుడే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ సెంటర్ సభ్యులు తులా ఆంజనేయులు, చంద్రకాంత్, లక్ష్మణ్ శ్రీనాథ్, తోట వెంకటేష్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, సురేష్ గౌడ్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News