Wednesday, March 11, 2026

పండగ పూట ప్రయాణికులకు ఇబ్బంది

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
సంక్రాంతి పండుగ పూట ఉదయం నుంచి బస్సులు కదలకపోవడంతో పల్లె గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. విషయం ఆరా తీస్తే కోరుట్ల బస్ డిపోలో అద్దె బస్సు సేవలు మంగళవారం ఉదయం నుండి నిలిచిపోయాయి. డిపోలో నడుస్తున్న అద్దె బస్సు డ్రైవర్లు తమకు ఇవ్వాల్సిన వేతనాలు 15 వేలు ఉండగా, యజమానులు ఇచ్చిన ఒప్పందం ప్రకారం 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారని తెలిసింది. అద్దె బస్సుల యజమానులు డ్రైవర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ విషయమే డిపో మేనేజర్ మనోహర్ ను వివరణ కోరగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News