Monday, March 16, 2026

ట్రస్ట్ సేవలు అభినందనీయం

  • సీఐ నిరంజన్ రెడ్డి

నేటి సాక్షి, మెట్ పల్లి : ట్రస్ట్ సేవలు అభినoదనియమని పట్టణ సీఐ నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో సాయమ్మ అనే పేదింటి మహిళ కుమార్తె రమ్య వివాహానికి పుస్తె, మట్టెలు, పట్టు చీరను ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో సిఐ నిరంజన్ రెడ్డి చేతులమీదుగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. సమాజహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులను అభినందించారు. విద్య, వైద్యం, ఇతర రంగాలలో సహాయం అందిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News