నేటి సాక్షి, మందమర్రి:- పట్టణ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా తుంగపిండి రాజలింగు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన ఎన్ వెంకటేశ్వర్లు ను మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మున్సిపల్ కమిషనర్ గా బదిలీ కాగా, ఆయన స్థానంలో రామగుండం కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రాజలింగును పట్టణ మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ, మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ను కార్యాలయం అధికారులు కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని పలు రాజకీయ పార్టీల, ప్రజా, కుల సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, మున్సిపల్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు కమిషనర్ ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.





