నేటి సాక్షి, మెట్ పల్లి ప్రతినిధి : వ్యవసాయ మార్కెట్ కమిటీ మెట్ పల్లి మార్కెట్ యార్డులో శుక్రవారం పసుపు కొనుగోళ్లను ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రైతులు పచ్చి పసుపు తీసుకు రాకుండా ఎండిన పసుపు వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చి గిట్టుబాటు ధరకు అమ్మి లబ్ధి పొందాలని అన్నారు. రైతులు దళారులను నమ్మవద్దని వ్యవసాయ మార్కెట్లో ప్రతి రైతుకు భరోస ఉంటుందని ప్రతి రైతు వ్యవసాయ మార్కెట్లో అమ్మి లాభాలు పొందాలని తెలిపారు.శుక్రవారం పసుపు కొనుగోలు కాడి రకం ధర రూ. పన్నెండు వెల అరువందల అరవై ఆరు రూపాయలు. గోల రకం పసుపు ధర పదివేల అరువందల అరవై ఆరు రూపాయలు. చూర రకం పసుపు ధర పది వెల నూట ఇరవై రెండు రూపాయలు ఉన్నాయని చైర్మన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు పుల్లూరి నవీన్ కుమార్, సంగు గంగాధర్, కటిపల్లి అనంతరెడ్డి, వ్యాపారస్తులు జెట్టి లింగం, మహజన్ నర్సింలు, సామ బుచ్చయ్య, పుల్లూరి రాములు, ఎలిమి రవి, పుప్పాల చిన్న అంజయ్య, గుంటుక అరవింద్, కుదుపుద్దిన్, అందే మారుతి కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ కుమార్, సిబ్బంది మరియు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు.





