Monday, March 30, 2026

గంజాయి తరలిస్తున్న ఇరువురి అరెస్ట్

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణ శివారులో గంజాయి తరలిస్తున్న ఇరువురిని అరెస్ట్ చేసినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఎస్ఐ కిరణ్ కుమార్ తన సిబ్బందితో మండలంలోని వేంపేట ఎస్ఆర్ గార్డెన్స్ ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంపై రాగా వారిని ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో వారి వద్ద గంజాయి పట్టుబడింది. దింతో వారిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టాగా ఒకరు నునావత్ సాయి నాయక్ గ్రామము ఎర్రపూర్ తండా ఇబ్రహీంపట్నం మండలం, రెండవ వ్యక్తి అజ్మీర శ్రీనివాస్ నాయక్ సత్తెనపల్లి గ్రామం నిర్మల్ జిల్లా అని తెలిసింది.వారిద్దరు కలిసి నిర్మల్ జిల్లాలోని కొమ్మ గూడెం లో చౌహన్ రమేష్ నాయక్ అనే వ్యక్తి వద్ద మూడు వెల రూపాయలు పెట్టి గంజాయి కొనుగోలు చేసి వాటిని మెట్ పల్లి లో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఎక్కువ ధరకు అమ్ముదామని వస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.వారిని అదుపులోకి తీసుకొని గంజాయిని, ద్విచక్ర వాహనాన్ని వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు ఇద్దరిని రిమాండ్ కు తరలించమని,గంజాయి అమ్మిన చౌహాన్ రమేష్ పరారిలో ఉన్నాడని త్వరలోనే అతనిని పట్టుకొని తగు చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News