Monday, March 30, 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డు లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పాఠశాల గోడను ట్రాక్టర్ ఢీకొట్టింది. ట్రాక్టర్ ఢీకొన్న వేగానికి గోడ పిల్లర్ సైతం విరిగిపోయింది. ఈ సంఘటనలో మోటార్ సైకిల్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి కింద పడ్డారు. ఈ సంఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న యాకూబ్ కు తీవ్ర గాయాలు కాగా ముజాహిద్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే యాకోబును 108 లో ప్రధమ చికిత్స అనంతరం జమ్మికుంట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిపారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News