Wednesday, March 25, 2026

దివ్యాంగులకు యూ.డి.ఐ.డి నెంబర్ జనరెట్ చేయాలి

  • సెర్ఫ్ సిఈఓ దివ్యదేవరాజన్
  • సోలార్ విద్యుత్ ప్లాంట్ల డి.పి.ఆర్. లను తయారు చేయాలి

నేటి సాక్షి-కరీంనగర్:
ప్రతి దివ్యాంగులకు యూ.డి.ఐ.డి నెంబర్ జనరేట్ చేయాలని సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం సదరం సర్టిఫికెట్ల నుంచి యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ, సోలార్ పవర్ ప్లాంట్ ల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. సెర్ఫ్ సిఈఓ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ… దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ బదులు యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ చేయాల్సి ఉంటుందని, సదరన్ సర్టిఫికెట్ నుంచి ఈ కార్డు జారీకి బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. దివ్యాంగులకు వైద్యులచే ధృవీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ ను యూ.డి.ఐ.డి పోర్టల్ లో నమోదు చేయాలని, దివ్యాంగులకు సంబంధించి ఇతర వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలన్నారు. దివ్యాంగులకు యూ.డి.ఐ.డి కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా ఇంటి అడ్రస్ కు అందుతుందని ఆమె తెలిపారు. అంధులకు విజన్, కుష్టి వ్యాధి గ్రస్తులు, వినికిడి సమస్య గలవారు, అంగవైకల్యం గలవారు, మానసిక వైకల్యం గల వారికి వైకల్య శాతాన్ని పరిశీలించి యూ.డి.ఐ.డి కార్డులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. నూతనంగా యూ.డి.ఐ.డి కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూ.డి.ఐ.డి జనరేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 28,2025 వరకు జారీ చేసిన సదరన్ సర్టిఫికెట్లతో చేయుట పెన్షన్, ఇతర సదుపాయాలను మన రాష్ట్రంలో దివ్యాంగులు పొందవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూ.డి.ఐ.డి కార్డు తప్పనిసరి అని అన్నారు. మార్చ్ ఒకటి నుంచి దివ్యాంగులకు యూ.డి.ఐ.డి జారీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారానే పెన్షన్ ఇతర సౌకర్యాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న మీసేవ కేంద్రాల నిర్వహకులకు, పంచాయతీ కార్యదర్శులకు, విఓఏలకు , సీసీలకు ఎంపీడీవోలకు, ఏడిఎంలకు యూ.డి.ఐ.డి దరఖాస్తుల నమోదు పై అవగాహన శిక్షణ అందించాలన్నారు. ఆసుపత్రిలో యూ.డి.ఐ.డీ నిర్ధారణ కోసం అవసరమైన వైద్యులు, పరికరాలు ఉండేలా చూడాలని, క్యాంపు అప్పుడు దివ్యాంగులకు కుర్చీలు త్రాగు నీరు ఇటువంటి వస్తువులు కల్పించాలని అన్నారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సమన్వయం చేస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి నూతనంగా కావాల్సిన వస్తువుల ప్రతిపాదనలు అందజేయాలని ఆమె కలెక్టర్లకు సూచించారు. నూతనంగా యూ.డి.ఐ.డి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆసుపత్రి లో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం అందించాలన్నారు. నిర్దారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూ.డి.ఐ.డి కార్డు జనరేట్ చేయాలన్నారు. ప్రధానమంత్రి కుసుం పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలలో స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. అక్కడ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేసే విధంగా డిపిఆర్ లను తయారు చేయాలని సిఈఓ సూచించారు. వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు, ప్రధానమంత్రి కుసం పథకం వినియోగించుకొని రైతులు మహిళా సంఘాల ద్వారా నడిపేలా చిన్న చిన్న సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక బద్ధంగా పని చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ శ్రీధర్, సిడిపిఓ శ్రీమతి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News