Wednesday, March 18, 2026

యుజిసి ముసాయిదాను ఉపసంహరించుకోవాలి

  • పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యను కాషాయకరణ చేసే కుట్రలో భాగంగా నూతన యుజిసి ముసాయిదాకు పునుకుందని, దానిని వెంటనే రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవనంలో నిర్వహించిన పిడిఎస్యు ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర యూనివర్సిటీల స్వయం పత్రిపదిని కుదించే ప్రయత్నం చేస్తుందని, యుజిసి కొత్త నిబంధనలు రాష్ట్రాల యూనివర్సిటీలకు గొడ్డలి పెట్టు అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన భావజాలాన్ని వేగంగా యువతరం లోకి తీసుకురావడం కోసం యూనివర్సిటీ లను వాడుకుంటుందని విమర్శించారు. రాష్ట్రాల పరిమితులో ఉన్న యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం యూజిసి ముసాయిదాను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ ముసాయిదాకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యార్ధి సంఘాలు ముందుకు వచ్చి, కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలు చేసి, యూనివర్సిటీలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్ధార్థ, కార్తీక్, రాహుల్, రాజ్ కుమార్, వంశీ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News