- సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వలపాటి మస్తాన్.
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల):
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద ప్రధాన మురికికాలువ గోడలు కూలిపోవడంతో,వాటిని మరమ్మతులు చేపట్టాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం, సులూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు జువ్వలపాటి మస్తాన్ తెలిపారు.ఈ సందర్భంగా గురువారం ప్రహరీ గోడ మరమ్మతులు చేపట్టేందుకు మున్సిపల్ కమిషనర్ ఫజ్జులుల్లా కు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జువ్వలపాటి మస్తాన్ మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా బీసీ సంఘం తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని, అయితే విగ్రహాల ఎదుట ఉన్న ప్రధాన మురికికాలువ గోడలు పూర్తిగా పడిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్నికి అంతరాయం రాకపోకలకు కలిగిస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేశామనీ కానీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్నారు.వెంటనే మునిసిపల్ కమిషనర్ స్పందించి పరిశీలించి ప్రహరీ గోడలు నిర్మాణానికి పరమతులు చేపట్టాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎస్ రామయ్య, మండల అధ్యక్షులు వినుకొండ శివ, టౌన్ అధ్యక్షులు ఆవుల వినోద్, నియోజకవర్గ కమిటీ సభ్యులు ముద్దా పార్టీ బాలాజీ,ఎస్ కే షరీఫ్, తదితరులు ఉన్నారు.





