నేటిసాక్షి, వనపర్తి:
వనపర్తి జిల్లా సవాయిగూడెం గ్రామ శివారులో గల అడవి ప్రాంతంలో గుర్తుతెలియని శవం కనిపించిందని అటవీ ప్రాంతానికి వెళ్లిన గొర్రెల కాపరులు గ్రామ ప్రజలకు సమాచారం ఇవ్వగా, గ్రామంలో ఉన్న వ్యక్తులు ఇక్కడ గుర్తు తెలియని శవం ఉందని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి కి సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే సీఐ కృష్ణ ఆధ్వర్యంలో వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి శవాన్ని పరిశీలించారు. తేదీ 10-01-2025 శుక్రవారం రోజున సవాయిగూడెం గ్రామ శివారులో కొత్త ప్లాట్ ఫారెస్ట్ ఏరియాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై శవాన్ని పరిశీలించి సుమారు వయస్సు 40 – 50 సంవత్సరాలు ఉండవచ్చునని, ఊడుగ చెట్టుకు ఆ వ్యక్తి ధరించిన పంచతో ఉరి వేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. శవము పూర్తిగా కుళ్ళిపోయి, తెల్లని చొక్క, జి.టి ఫ్యాషన్ టైలర్ మార్క్, నడుముకు ఎర్రని మొలతాడు, ఈ.ఎస్.ఎస్.ఏ. కంపెనీకి చెందిన బ్రౌన్ కలర్ ఫుల్ డ్రాయర్, జేబులో సున్నము డబ్బా మరియు పొగాకు కలిగిన తెల్లని ప్లాస్టిక్ కవర్, శవము పక్కన బ్లూకలర్ స్వెటర్, తెల్లని పంచ, నల్లని అద్దాలు పడి ఉన్నాయని తెలిపారు. ఇతను అందాజా 30 నుండి 40 రోజులలో చనిపోయినట్లు ఎస్సై గుర్తించారు. మొగ మనిషి శవాన్ని ఎవరైనా గుర్తిస్తే వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై 8712670613, వనపర్తి సీఐ 8712670611 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.