- రైతు నుంచి రూ. 1.77 లక్షలు చోరీ
- శాంతినగర్ గ్రామ శివారులో ఘటన
- టీవీఎస్ పై వెళ్తున్న రైతు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత రైతు
నేటి సాక్షి, కోదాడ (అనంతగిరి) : ఆరుగాలలు కష్టపడి పండించిన పంటను రైతు అమ్మి లక్ష 77 వేల 817 రూపాయలను తీసుకొని వస్తున్న క్రమంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు రైతును కొట్టి డబ్బులు తీసుకెళ్లిన ఘటన అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలో గొండ్రియల గ్రామానికి చెందిన కొండబాలు పుల్లయ్య అనే రైతు నెలకొండపల్లి గ్రామానికి చెందిన కొత్త శేఖర్ కు వడ్లు అమ్మినాడు. కాగా అతను వడ్ల డబ్బులను రైతుకు ఇచ్చాడు. రైతు పుల్లయ్య తన యొక్క టీవీఎస్ పై వస్తున్న క్రమంలో శాంతినగర్ గ్రామ శివారులో ఎవరో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వచ్చి రైతు పుల్లయ్య అడ్డగించి, బెదిరించి, కొట్టి తన వద్ద ఉన్న లక్ష 77 వేల 817 రూపాయలను బలవంతంగా దొంగలించారని తెలిపారు. ఇట్టి విషయంపై బాధ్యత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే కష్టపడి చెమటోచి పండించిన పంట చేతికి నగదు రూపంలో వచ్చి దొంగలపాలు కావడంతో రైతు ఆవేదన వర్ణాతీతంగా మారింది.





