- మానేరు బ్రిడ్జి అంశంపై మండలం ప్రజలు హర్షం
నేటిసాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మానేరు పై బ్రిడ్జి హామీలను కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ త్వరలో నెరవేరుస్తున్నారని బ్రిడ్జి జేఏసి చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. గన్నేరువరం నుండి కరీంనగర్ కు బ్రిడ్జి నిర్మాణం కొరకు కేంద్ర మంత్రి నితిన్ గట్కరీని బండి సంజయ్ కోరడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో బండి సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంతో గన్నేరువరం, ఇల్లంతకుంట, బెజ్జంకి మూడు మండలాల ప్రాంత ప్రజలు పడుతున్న బాధలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి త్వరగా తిను నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలన్నారు. బ్రిడ్జి లేని కారణంగా ఇక్కడి ప్రాంత ప్రజలు విద్యా వైద్యానికి దూరమవుతున్నారని అన్నారు. త్వరగా బ్రిడ్జి కోసం నిధులు మంజూరు అయ్యేలా కృషిచేసి మూడు మండలాల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో, అంజయ్య, రాజ కుమార్, బామండ్ల కృష్ణ, భామండ్ల అనిల్, నవీన్, నరసయ్య, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.