నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లాలోని అల్మాజీపూర్ గుమ్మాస్ (దర్గా) వద్ద ఉర్సు లో పాల్గొన్న, మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, ఎల్లారెడ్డి మండలంలోని, అల్మాజీపూర్ గ్రామంలో గల పురాతన కట్టడం అయిన గుమ్మాస్ (దర్గా) వద్ద ప్రతీ సంవత్సరం ఉర్సు కార్యక్రమాన్ని, హిందు మరియు ముస్లీం సోదరులు అందరు కలిసి, ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉర్సు కార్యక్రమం ఆహ్వానం మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్టాం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. వీరితో పాటు, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, ఎల్లరెడ్డి మండల మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ గఫర్, అల్మాజీపూరు గ్రామ మాజీ సర్పంచ్ దత్తు, తదితరులున్నారు.




