- శిక్షణకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
జనవరి 10 నుంచి టాస్క్ ద్వారా వివిధ కోర్సులు శిక్షణకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులు ఇటీవల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు ప్రారంభించిన టువంటి నైపుణ్యాభివృద్ధి కేంద్రం టాస్క్ ద్వారా వివిధ కోర్సులకు సంబంధించి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణా తరగతులలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు నిషినార్థులైన బోధకులచే తరగతులను నిర్వహించడం జరుగుతుందని , అంతే కాకుండా టాస్క్ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న బహుళజాతి సంస్థలలో ఉద్యోగ అవకాశాలను కూడా ఇప్పించడం కోసం జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఔత్సాహికులైన నిరుద్యోగ విద్యార్థులు అందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, ఆసక్తి కల విద్యార్థులందరూ టాస్క్ కేంద్రానికి వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, జనవరి 10 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని, అదేవిధంగా తరగతులు జనవరి 20 నుంచి ప్రారంభమవుతాయని ,ఇతర వివరములకు పెద్దపల్లి ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో గల టాస్క్ ఆఫీసులో సంప్రదించగలరని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.





