Friday, April 3, 2026

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు నీటిటాంక్ అందజేత

నేటి సాక్షి, జమ్మికుంట : విద్యార్థుల్లో విద్యావిలువలు పెంపొందించి, మంచి పౌరులుగా దేశానికి అందించడానికి వాసవి క్లబ్ కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, స్టడీ మెటీరియల్స్ అందించడం మొదలగు కార్యక్రమాలు చేపట్టడంలో వాసవి క్లబ్ ముందుంటుందని వాసవి క్లబ్ జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ అన్నారు. వాసవి క్లబ్ జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలు చేపడుతుందని వాసవి క్లబ్ గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్ తెలిపినారు. జమ్మికుంట లోని కొత్తపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం స్వర్గీయ మద్ది రాజశేఖరం జ్ఞాపకార్థం వారి కుమారులు మద్ది రవికుమార్, మద్ది శివప్రసాద్ లు అందించిన నీటి ట్యాంక్ ను పాఠశాలకు అందించారు. జై హనుమాన్ బ్రిక్స్ అధిపతి పొనగంటి మధు నీటి టాంక్ కొరకు సిమెంట్ గద్దె నిర్మాణానికి సహకరించినారు. పాఠశాల ఉపాధ్యాయులు వాసవిక్లబ్ నిర్వాహకులకు, జై హనుమాన్ బ్రిక్స్ వారికికృతజ్ఞతలుతెలియజేసారు. కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఒక్క కార్యక్రమములో వారు పాల్గొని మాట్లాడినారు. ఈ కార్యక్రమములో జమ్మికుంట వాసవి క్లబ్ అధ్యక్షులు అయితు రమేష్, ప్రధాన కార్యదర్శి జి. వి సతీష్, కోశాధికారి రేణుకుంట రాజు, ఉపాధ్యాయులు వి.రాజేందర్, బి.ఐలయ్య, ఆర్.స్వామి, మర్రి అవినాష్ మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News