సమాజ సేవలో వాసవి క్లబ్ ముందుండాలి.
వాసవి క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణి కుంట్ల శ్రీనివాస్.

నేటిసాక్షి, జమ్మికుంట:
వాసవి క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణిగుంట్ల శ్రీనివాస్ గవర్నర్ ఇల్లందుల కిషన్ హాజరయ్యారు. అనంతరం వాసవి మాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, జమ్మికుంట వాసవి క్లబ్ నూతన కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షులుగా అయితు రమేష్ ప్రధాన కార్యదర్శిగా గుడివాడ వెంకట సతీష్ కోశాధికారిగా రేణిగుంట రాజు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజ సేవలో వైశ్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కులమతాలకు అతీతంగా నిరుపేదలకు సేవ చేయడంలో వైశ్యులు ఎప్పుడు ముందంజలో ఉంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నూతన కమిటీ గా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ సేవలను పారదర్శకంగా నిర్వహించాలని వారికి సూచించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు అందించడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ, మాపై నమ్మకంతో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన వాసవి క్లబ్ కుటుంబ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మాకు అప్పగించిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తామని వాసవి క్లబ్ సేవలను పదిమందికి ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. వాసవి క్ల బ్ సభ్యుల సహకారంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ఆధ్వర్యంలో అతిథులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులు అయితు రమేష్ ప్రధాన కార్యదర్శి గుడివాడ వెంకట సతీష్ కోశాధికారి రేణిగుంట్ల రాజు తోపాటు జిల్లా బాధ్యులు తంగళ్ళపల్లి రాజ భాస్కర్ రీజినల్ చైర్మన్ అయిత రమాదేవి జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ గందే ప్రవీణ్ జాంసాని రమేష్ రావికంటి నీలకంఠం రావికంటి మధుబాబు జిల్లా చైర్మన్ గుండా కేదారి జోనల్ చైర్మన్ సుద్దాల శ్రీనివాస్ మాజీ అధ్యక్షులు లంకెలపల్లి శరత్ కుమార్ తోపాటు వాసవి క్లబ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




