- కవిత్వంతో లక్షలాది మంది ప్రభావితం అవుతారు
- కష్టాన్ని గౌరవించేవిధంగా సాహిత్యం ఉండాలి
- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి



నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలోని దామోదర్ రెడ్డి మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుద్ధారం గ్రామానికి చెందిన చిక్కొండ్ర రవి రచించిన వీరనాగు శతకం పుస్తక ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో చిక్కొండ్ర రవి రచించిన ” వీరనాగు “శతకంను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని బుద్దారం గ్రామములో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిక్కొండ్ర రవి చిన్న వయసులో గ్రామీణ ప్రజల జీవన విధానం సామాజిక అసమానతలను, జీవకోటికి ప్రాణమైన నీళ్ళను సాహిత్యంగా తీసుకొని వీరనాగు శతకం రచించడం అభినంద నీయం అని అన్నారు.చిన్ననాటి నుండి తాను పెరిగిన పరిస్థితు లను గ్రామీణ ప్రజల కష్టాలను క్లుప్తంగా చూస్తూ ఒకనాడు వర్షంపై ఆధారపడే వ్యవసాయాన్ని చూసి చలించిపోయిన నేను అపర భగీరథ ప్రయత్నంతో కృష్ణ జలాలు తీసుకొచ్చిన వైనాన్ని రవి వివరించారని కొనియాడారు.వీరనాగు శతకం సామాజిక శతకంగా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. సాధారణంగా ఆవిష్కరణలో సాధారణ స్థితిలో జరుగుతాయని కానీ ఈరోజు తాను పుట్టిపెరిగిన గ్రామం ప్రజల మధ్యన ఆవిష్కరించడం అభినందనీయం అని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.కార్యక్రమాన్ని వనపట్ల సుబ్బయ్య సభాధ్యక్షులుగా వ్యవహరించారు. మధిర మల్లమ్మ వీరనాగు పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో డా.శిఖామణి , కవులు, రచయితలు, సంపాదకులు సంధ్య, ప్రభుత్వ సిటికళాశాల తెలుగుశాఖ అద్యక్షులు డా. కోయి కోటేశ్వర రావు, తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు డా. కె. వీరయ్య, విప్లవ్, అనంతోజు మోహన్ కృష్ణ,రామ్మూర్తి,భరద్వాజ అమర్ నాథ్,గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాఠశాల పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. వనపర్తికి చెందిన నిదిత,తులసి విద్యార్థినిలతో కూచిపూడి నాట్యంచేశారు. డప్పు లక్ష్మణ్ కళాబృందంతో ఆటపాట నిర్వహించడం జరిగింది.





