Monday, March 23, 2026

వీరాపూర్ పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక

  • సీఎం, ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు

నేటి సాక్షి, బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వీరాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసినందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా,సోమవారం వీరాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల లక్ష్మయ్య, అవుసుల నరసింహ చారి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గు పోయడం జరిగింది. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరు నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ పులి సంతోష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రవుల సందీప్, వీరాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి, బైర సంతోష్, చుక్క సమీకృత్, మిట్టపల్లి చెన్నారెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షులు చుక్క హరిష్, మిట్టపల్లి బల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, రమణ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రెవోజు భాస్కరచారి, సురేష్, శంకర్, మల్లేష్, తిరాన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News