- వేలం పాటలో పాల్గొన్న 60 మంది కొనుగోలుదారులు


నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలం పాట నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇందుకు సంబంధించి ముందుగానే పోలీసుల ఆధీనంలో ఉన్న ఎవరూ గుర్తించనటువంటి, ఎవరికి సంబంధించినవో తెలియని, ఎవరు తీసుకువెళ్లని వాహనాలను ప్రభుత్వ ఆదేశానుసారం ఆరునెలల గడువు ముగిసింది. ఎవరూ స్పందించనందున వాటిని శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు వేలం పాట నిర్వహించగా జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

పలు సందర్భాల్లో స్వాధీన పరుచుకున్న మరియు రోడ్లమీద వదిలేసిన వాహనాలు మొత్తం 54 వాహనాలకు వేలంపాట నిర్వహించగా ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు మొత్తం 5,36,000/- రూపాయలని తెలిపారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో సర్వీస్ లో లేని కిట్ ఆర్టికల్స్, పాతబడిన టెంట్లు, ఇనుప సామాగ్రి,జెనరేటర్, స్టోర్ మొదలగు వసువులను వేలంపాట నిర్వహించగా, ఈ వేలం నిర్వహణ ద్వారా వచ్చిన రూపాయలు మొత్తం 1,54,100/- రూపాయల మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, 60 కి పైగా కొనుగోలుదారులు ఈ వేలం పాటలో పాల్గొన్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ వేలం పాటలో అదనపు ఎస్పీ చంద్రయ్య గారు,స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ,ఆర్.ఐ లు మధుకర్,రమేష్ ,ఆర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.





