ఎస్పీ అఖిల్ మహాజన్..
నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకున్నా వాహనాలు, వివిధ ప్రాంతాలలో రోడ్లపై వదిలేవేయబడిన మరియు గుర్తుతెలియని వాహనాలను వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సర్వీస్ లో లేని పలు వస్తువులు ఈనెల 18న ఉదయం 10 గంటలకు జిల్లా పరిధిలోని తాడూర్ లో గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న 54 వాహనాలను సంబంధిత యజమానులు తీసుకెళ్లాలని తీసుకోకపోతే వేలం వేస్తామని గతంలో జులై నెలలో పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగిందని ఆరు నెలలు గడిచినా వాహనాలను తీసుకెళ్లేందుకు రాకపోవడంతో మొత్తం వివిధ రకాల 54 వాహనాలలో 53 వాహనాలు స్క్రాప్ దశలో మరియు 01 వాహనం కండిషన్ దశలో ఉన్నాయని ఈవాహనాలను వివిధ పోలీస్ స్టేషన్లలో సర్వీస్ లో లేని పలు వస్తువులను తాడూర్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు ప్రకటించారు.





