- మృతునికి ఘన నివాళులు అర్పించిన బిజెపి పార్టీ శ్రేణులు
- రాష్ట్ర నాయకులు మెంటపల్లే పురుషోత్తం రెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 27 : బిజెపి శ్రీరంగాపురం మండలం మాజీ మండల అధ్యక్షుడు, ప్రస్తుత జిల్లా కౌన్సిల్ నెంబర్ అయినా వెంకటస్వామి ముదిరాజ్ గుండె పోటుతో అకాలంగా నిన్న రాత్రి మరణించడం జరిగింది. ఆ విషయం తెలిసిన మేము జిల్లా బిజెపి నాయకులు, రాష్ట్ర నాయకులు, వివిధ మండలాల అధ్యక్షుల తో కలిసి సోమవారం వారి స్వగ్రామం శ్రీరంగాపూర్ నందు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు సమర్పించి భారతీయ జనతా పార్టీ జెండాను వారి పార్థివ దేహం పై కప్పి ప్రగాఢ సంతాపం తెలియడంతో పాటు వారి అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. వారు లేని లోటు బిజెపి పార్టీకి తీర్చలేనిదని, అందరిని అన్న అంటూ ఆప్యాయంగా పలకరించే గొంతు మూగబోయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాము. ఎప్పుడు ఆరోగ్యంగా హుషారుగా ఉండే మంచి మనిషి బిజెపి పార్టీ సహచర మిత్రులకు ఒక స్నేహశీలి మృదు స్వభావి అయిన వెంకటస్వామి మరణం మా అందరికీ ఎంతో బాధాకరం వారి లేని లోటు తీర్చలేనిదని భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. వారి అంత్య క్రియలకు బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ, అయ్యవారి ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి,అధికార ప్రతినిధి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు వేమారెడ్డి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు వనపర్తి మండల పార్టీ అధ్యక్షుడు సంద వెంకటేష్, శ్రీరంగాపురం మండల పార్టీ అధ్యక్షుడు విష్ణు నాయుడు, పెబ్బేర్ టౌన్ అధ్యక్షుడు క్రాంతి, రూరల్ అధ్యక్షుడు నాగరాజు గణపురం మండల అధ్యక్షుడు బుచ్చిబాబు రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి కదిరే మధు మరియు పార్టీ తాలూకా స్థాయి మండల స్థాయి పదాధికారులు క్రియాశీల నాయకులందరూ హాజరై నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని పరలోక ప్రాప్తి ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నాము.





