నేటిసాక్షి, కొడిమ్యాల కొడిమ్యాల : కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఆదివారం శ్రీవెంకటేశ్వర, భక్త మార్కండేయస్వామి ఆలయాల్లో శనివారం స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఉభయ దేవాలయాల్లో ముందుగా ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని కనుల వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి అధికంగా భక్తులు తరలిరావడంతో ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాలు, అన్న వితరణ స్వామివారి దర్శనం భక్తులకు ప్రశాంతంగా నిర్వహించారు.





