Friday, March 13, 2026

పాడి రైతుల సంక్షేమానికే పశు వైద్య శిబిరాలు

  • ఎం తిరుమలరెడ్డి
  • బొప్పరాజు పల్లి లో పశు వైద్య శిబిరానికి అపూర్వ స్పందన.

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రపురం పాడి రైతుల సంక్షేమానికే ప్రభుత్వం గ్రామాలలో పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం తిరుమలరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అనుపల్లి పంచాయతీ బొప్పరాజు పల్లి గ్రామంలో మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. గ్రామాలలో పశు సంరక్షణ కోసం పాడి రైతులకు గోకులం షెడ్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని వివరించారు. మొదట విడతగా యర్రవారిపాళ్యం, చిన్నగొట్టుగలు మండలాలతోపాటు,నారావారిపల్లి మెగా పైలెట్ ప్రాజెక్టు నందు రైతులకు గోకులం షెడ్లను మంజూరు చేశారని , రెండవ విడత రామచంద్రపురం మండలంలో కూడా పాడి రైతులందరికీ మినీ గోకులం షెడ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ఉచిత పశువైద్య శిబిరాలు జనవరి 30వ తేదీ వరకు మండలంలో అన్ని గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది, పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కుప్పం బాదూరు పశువైద్యాధికారి డాక్టర్ హేమ కుమార్ అన్నారు. పశు వైద్య శిబిరంలో 318 పాడిపశువులకు పిడెదలు నివారణ కోసం స్ప్రే చేయడం, 62 పాడి ఆవులకు ప్రథమ చికిత్స నిర్వహించి, కట్టు సమస్య ఉన్న 23 పాడి ఆవులకు టీకాలు వేసామన్నారు.150 సన్న జవాలకు నటుల నివారణ కోసం మందులు తాపించామన్నారు. 100 గొర్రెలు, మేకలు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి షీపాంక్స్ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయ కిషోర్, కిరణ్ కుమార్, ఏపీవో హంస వేణి, టిడిపి నాయకులు చేకూరు జనార్దన్ చౌదరి, పంతల వెంకటేష్ నాయుడు,సిద్దయ్య, ప్రకాష్, సోము, యోగ, నాగార్జున్, సర్పంచ్ గోవర్ధన్, విజయ్ కుమార్ రెడ్డి, జి మహేష్, కుమార్, బి కోటీశ్వర్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, పాడి రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News