Friday, April 3, 2026

విద్యార్థులతో ఘనంగా ప్రారంభమైన వికసిత్ భారత్ యంగ్ పార్లమెంట్

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : కార్యక్రమం ప్రారంభ సమావేశానికి సింగరేణి కాలరీస్ కంపెనీ, ఆర్ జీ – 1 ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగవ అతి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ గా ఎదుగుతునదన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రజల్ని పేదరికం నుండి బయట పడేస్తుందని, రైతులు ఈ దేశాన్ని ఆహార కొరత ఏర్పడకుండా ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారని అన్నారు. ఈ విధంగా యువత కూడా దేశానికి కొత్త నాయకత్వానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డా జై కిషన్ ఓజా మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన యువ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించుకునే అవకాశం కల్పించినందుకు శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డా మనోహర్. నెహ్రూ యువ కేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ శ్రీ మద్దుల వెంకట రాంబాబు. ధన్యవాదాలు తెలియజేశారు. నోడల్ అధికారి ఏ సాంబశివ రావు మాట్లాడుతూ… న్యాయ నిర్ణేతలు వివిధ అంశాలను పరిశీలించి మొత్తం 100 మార్కులకు పాయింట్లు వేస్తారని చెప్పారు. పోటీలో ఉన్నవారు నిర్ధారిత అంశాలలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. మొదటిరోజు 75 మంది అభ్యర్థులు వచ్చి వన్ నేషన్, వన్ ఎలక్షన్: పేవింగ్ థీ వే ఫర్ విక్సిత్ భారత్. మూడు నిముషాలకు మించకుండా మాట్లాడారు. యువత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ డా జి సుబ్బారావు, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ డా. ఏం నరేష్, డా. డి. కిరణ్మయి, డా. శారద, డా. తిరుపతి, డా.పి శంకరయ్య, పి. శ్రీదేవి, పి. ఉషారాణి, డా సురేష్, డా. స్రవంతి, ఏస్. సమత, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, ఎన్ సీ సీ స్టూడెంట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News